స్కూల్స్, కాలేజీల ఫైర్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓసీలకు కొత్త గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్

స్కూల్స్, కాలేజీల ఫైర్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓసీలకు కొత్త గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్
  • పాత బిల్డింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఖాళీ స్థలాల నిబంధనల్లో వెసులుబాటు
  • ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేఫ్టీ పరికరాలు, ఎన్ఓసీ తప్పనిసరి
  • ఈ నెల 10 నుంచి కొత్త మార్గదర్శకాలు అమలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: స్కూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంటర్మీడియట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీలకు ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓసీ జారీ చేసే నిబంధనలను అగ్నిమాపక శాఖ సరళీకరించింది. భవన నిర్మాణ పరిమితులు, ఖాళీ స్థలాల కొరత, అదనపు మెట్ల మార్గాల ఏర్పాటులో విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.ఈ నిబంధనలు నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10 నుంచి ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓసీ దరఖాస్తులకు వర్తించనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఫైర్ సర్విసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీజీ విక్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుధవారం గైడ్​లైన్స్ విడుదల చేశారు.

విద్యాసంస్థల యాజమాన్య సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 8న సంబంధిత వర్గాలతో నిర్వహించిన సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం జారీ చేసే ఆక్యుపెన్సీ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓసీ మూడేళ్లపాటు చెల్లుబాటులో ఉంటుంది. గడువుకు 2 నెలల ముందే విద్యాసంస్థల యాజమాన్యాలు నిర్దేశిత రుసుముతో పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాత విద్యాసంస్థల భవనాలకు అదనపు ఖాళీ స్థలాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలనే నిబంధనలో వెసులుబాటు కల్పించారు.

నిర్దేశిత సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తక్కువగా ఉన్న భవనాల్లో మంటల వ్యాప్తిని నిరోధించేందుకు ప్రత్యామ్నాయంగా వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్టెన్లు, 4 వైపుల నుంచి నీటిని అందించే ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రిగేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే నిర్మించిన పాఠశాలలు, కళాశాలల్లో రెండో మెట్ల మార్గం ఏర్పాటు చేయడంలో ఎదురవుతున్న సమస్యలను కూడా శాఖ పరిగణనలోకి తీసుకుంది. అగ్నిమాపక పరికరాలు, ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాన్యువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలక్ట్రానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలారం వ్యవస్థలు ఏర్పాటు చేయాలి.

అవసరమైన చోట రసాయన, కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, సర్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గదుల్లో మాడ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ప్రింక్లర్లు, డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమర్లు, పైకప్పుపై అగ్నిమాపక నీటి ట్యాంకులు, పంపులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. మెట్ల మార్గాలు, కారిడార్లు, బయటకు వెళ్లే ద్వారాలు, అత్యవసర ఎగ్జిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్గాల్లో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. ఎమర్జెన్సీ లైటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలిగే ఎగ్జిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచికలు ఏర్పాటు చేయాలి. అగ్నిమాపక నీటి నిల్వలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలి. విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భద్రత, పరికరాల నిర్వహణ, ప్రథమ చికిత్స సదుపాయాలపైనా ప్రత్యేక దృష్టి సారించాలని శాఖ సూచించింది.